Breaking News

హైదరాబాద్ శిల్పారామం రీ ఓపెన్..!

26 th Sep 2020, UTC
హైదరాబాద్ శిల్పారామం రీ ఓపెన్..!

హైటెక్ సిటీలో పల్లెటూరి వాతావరణాన్ని తలపించే పర్యాటక ప్రదేశం లాక్ డౌన్ మూలంగా మూతపడింది. అయితే కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో ఇప్పటి వరకు దానిని తిరిగి ఓపెన్ చేయలేదు. తాజాగా అక్టోబర్ 2వ తేదీ నుంచి శిల్పారామం తిరిగి ఓపెన్ కాబోతోంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శిల్పారామం తెరిచే ఉంటుంది.

అయితే కరోనా నిబంధనలతో కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాల మేరకే ఈ శిల్పారామాన్ని తెరిచి ఉంచనున్నారు. సందర్శనకు వచ్చిన వారి బాడీ టెంపరేచర్ ను పరిశీలించిన తరువాతే లోపలకి అనుమతిస్తారు. శ‌నివారం నుంచి అర్బ‌న్ పార్కుల‌ను తెరిచేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చేసిన నేపధ్యంలో శిల్పారామం కూడా తెరుచుకోనుంది. అయితే శానిటైజర్లు అందుబాటులో ఉంచి కేవలం మాస్కులు ధరించిన వారిని మాత్రం లోపలకు అనుమతించనున్నారు.  మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox