Breaking News

లాక్ డౌన్ దిశగా హైదరాబాద్..?

29 th Jun 2020, UTC
లాక్ డౌన్ దిశగా హైదరాబాద్..?
లాక్ డౌన్ ను సడలించారో లేదో..కరోనా మహమ్మారి కేసులు కుప్పలు తెప్పలు గా నమోదవుతూ వచ్చాయి..ఈ క్రమం లో ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ మహమ్మారి తీవ్ర స్థాయి లో విరుచుకుపడుతోంది. ఇంచుమించు తెలంగాణ లోను అదే పరిస్థితి నెలకొంది. గ్రేటర్ పరిధి లో కరోనా మహమ్మారి ని రోజు రోజుకు అదుపు తప్పి ఉచ్చు బిగిస్తోంది.. ఇప్పటికే మహారాష్ట్ర లో కొన్ని ప్రాంతాలు.. ఢిల్లీ లో ను కొన్ని ప్రాంతాలు.. చెన్నై.. వంటి నగరాలూ తిరిగి లాక్ డౌన్ కు వెళ్లిపోయాయి.
 
                ఇక భాగ్య నగరం గా వెలుగొందుతున్న హైదరాబాద్ కు కూడా అదే పరిస్థితి దాపురించేలా ఉంది. కేసులను అదుపులోకి తీసుకురావడం వల్ల కానీ పని.  అటు ఏపీలో కూడా కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ నడుస్తోన్న  సంగతి తెలిసిందే. దీనితో... హైదరాబాద్ కు కూడా లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదని స్పష్టమవుతోంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు లాక్ డౌన్ నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే.. అది బెడిసికొట్టి కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. 
 
               తాజాగా.. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ బాధితులకు చికిత్స లాంటి అంశాలపై ప్రగతి భవన్ లో  ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఈ మేరకు లాక్ డౌన్ పై స్పందించారు. మరో 2-3 రోజుల్లో కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించడంపై తుది నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టంచేశారు. తెలంగాణ మొత్తం కాకపోయినా.. జిహెచ్ఎంసి పరిధి లో లాక్ డౌన్ విధించడం అవసరమని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కెసిఆర్ కు విన్నవించింది. గత పది రోజులు గా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి.. నిన్న ఒక్కరోజే 1087 కేసులు నమోదవడం తో అధికారుల్లో ఆందోళన మొదలైంది.  దీంతో రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 13,436కు చేరగా.. మొత్తం మృతుల సంఖ్య 243కు చేరుకుంది. అధిక మరణాలు గ్రేటర్ పరిధి లోనే చోటు చేసుకోవడం గమనార్హం. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox