Breaking News

ఒక్క వ్యక్తి కోసం నడిచిన మెట్రో

17 th Oct 2020, UTC
ఒక్క వ్యక్తి కోసం నడిచిన మెట్రో

హైదరాబాద్: కుండపోతగా వర్షం కురుస్తున్న వేళ ఒక్క వ్యక్తి కోసం హైదరాబాద్ లో ఒక్క వ్యక్తి కోసం మెట్రో నడిచింది.  మెట్రోకు నిర్దేశించిన సమయం  పూర్తి అయినా అత్యవసర సమయాల్లో పౌరులకోసం నడపాలన్న నిబంధన మేరకు  అధికారులు మెట్రోను నడిపారు.

ఈ నెల 14న రాత్రి హైదరాబాద్ నగరంలో  భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఎల్బీ నగర్‌–మియాపూర్‌ మార్గంలోని విక్టోరియా మెమోరియల్‌ (కొత్తపేట) స్టేషన్‌కు రాత్రి దాదాపు 10 గంటలకు ఓ గర్భిణి చేరుకుంది. తనను ఎలాగైనా మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు చేర్చాలని అధికారులను వేడుకుంది.  మెట్రో సర్వీసులను   ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే నడుపుతున్నారు. అయితే  గర్భిణి విజ్ఞప్తి మేరకు మానవత్వంతో స్పందించిన మెట్రో సిబ్బంది... ఉన్నతాధికారుల అనుమతితో ఆ ఒక్క మహిళ కోసమే మెట్రోరైలును నడిపారు.

ఎల్బీ నగర్‌ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరిన రైలు... 10:40 గంటలకు మియాపూర్‌కు గర్భిణిని సురక్షితంగా చేర్చారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో రైళ్లను నడపాలన్న నిబంధన ఉందన్నారు. ప్రస్తుతం నగరంలో వర్ష బీభత్సానికి రోడ్లు అధ్వానంగా మారినందున మెట్రో రైళ్లలో గ్రేటర్‌ ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు. మరిన్ని హైదరాబాద్ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox