Breaking News

హైదరాబాద్ పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం

23 rd Jun 2022, UTC
హైదరాబాద్ పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. తాజాగా చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ శ్మశాన వాటికలో సమాధిపై ఓ మహిళా తహసీల్దార్ పై చేతబడికి యత్నించారన్న విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బండ్లగూడలో నాలుగేళ్ళు తహసీల్దార్ పనిచేసిన షేక్ ఫర్హాన్ ఫొటో లభ్యం కావడం  కలకలం రేపుతోంది.

పాతబస్తీ  బార్కాస్ లోని బడా ఖబ్రస్తాన్లోలో బంధువు సమాధికి పూలు సమర్పించడానికి ఓ వ్యక్తి. ఈనెల 17వ తేదీన వెళ్లాడు. అక్కడ సమాధిపైన క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు, ఆందోళనకరమైన వస్తువులు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆ వ్యక్తి పాతబస్తీ ఛత్రీనాకకు చెందిన చేతబడిని నిర్మూలించే వ్యక్తిగా పేరొందిన జునైద్ బక్బాబీకి కబురు అందించాడు. జునైద్ అక్కడికి వెళ్ళి చూడగా సమాధిపై  విచిత్ర వస్తువులు కలిగి ఉన్న ఓ మూట కనిపించింది. దీంతో ఆ మూటను తీసుకున్నాడు జునైద్. తనతో పాటు మూటను ఇంటికి తీసుకువెళ్లి మూటను విప్పాడు. అందులో ఒక్కొక్క వస్తువును బయటికి తీస్తుండగా దారం కట్టి మడత పెట్టిన చిత్రపటం కనిపించింది. అది విప్పగా చిత్రపటం వెనుకాల ఉర్దూ అరబిక్ భాషలో రాసిన పదాలు కనిపించాయి. ముందు భాగంలో బండ్లగూడలో నాలుగేళ్ళ పాటు తహసీల్దార్ కొనసాగిన షేక్ ఫర్హాన్ చిత్రపటం కనిపించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఇదంతా జునైద్ మూటను విప్పుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది. 

2018 అక్టోబర్‌లో బండ్లగూడ మండల తహసీల్దార్​గా షేక్ ఫర్హాన్ బాధ్యతలు స్వీకరించారు. 2022లో బదిలీపై ఆసిఫ్ నగర్ మండల కార్యాలయానికి వెళ్ళారు. ఆమె బదిలీపై వెళ్ళిన 5 నెలల్లోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల పాతబస్తీలో తీవ్ర కలకలం రేపుతోంది. షేక్ పర్దీన్ బండ్లగూడలో తహసీల్దార్ చేసిన సమయంలో అందరితో కలుపుగోలుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఆమెపై ఇలాంటి చర్యలకు ఎవరు? ఎందుకు పాల్పడి ఉంటారని యోచిస్తున్నారు. ఏదైనా స్థల వివాదంలో తహసీల్దార్​పై పగ పెంచుకొని ఇలా చేసి ఉంటారేమో అని స్థానికులు అనుమానిస్తున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox