Breaking News

నేటి నుంచి సంక్షేమ హాస్టల్స్ ఓపెన్.?

04 th Jun 2020, UTC
నేటి నుంచి సంక్షేమ హాస్టల్స్ ఓపెన్.?
కరోనా మహమ్మారి.. అంతకంతకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే కేంద్రం సడలింపులు ఇస్తూ వస్తోంది. కరోనా తో సహజీవనం తప్పదని.. జాగ్రత్తగా మసలుకోవాల్సిందేనని చెబుతూ వస్తోంది. అయితే.. ఇప్పటి వరకు లాక్ డౌన్ కారణం గా సంక్షేమ హాస్టల్స్ అన్ని మూత పడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణలో మూతబడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు నేడు తెరుచుకోనున్నాయి. ఈ నెల  8 నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపధ్యం లో విద్యార్థులకు హాస్టల్స్ అవసరం అవుతాయి. ఈ సందర్భం గా విద్యార్థుల కోసం హాస్టల్స్ కూడా తెరుచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీనితో.. దాదాపు పద్దెనిమిది వేల మంది విద్యార్థులు తిరిగి హాస్టల్స్ కు వచ్చే అవకాశం ఉంది. 
            అయితే.. కరోనా భయం ఉండడం తో.. విద్యార్థులకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల కోసం, తీసుకోవాల్సిన జాగ్రత్త ల గురించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులందరూ విధి గా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించే  అంశం పైన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గదికి ఐదుగురిని మాత్రమే అనుమతించనున్నారు.  రోగ నిరోధకశక్తి పెంచేలా పండ్ల రసాలు, పండ్లు, స్నాక్స్‌ను రోజువారీ ఆహారంతోపాటు అందించాలి. విద్యార్థులను బృందాలుగా చేసి ప్రత్యేకగదుల్లో భోజనానికి ఏర్పాట్లుచేయాలి.  అలానే విద్యార్థులను ప్రైవేట్ వాహనాల ద్వారా పరీక్షా కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం సూచించింది. 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox