Breaking News

హైదరాబాద్ టు విజయవాడకు హై స్పీడ్ రైలు : కేటీర్

29 th Jun 2020, UTC

సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నూతన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. సహచర మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఈ కార్యక్రమం లో పాలు పంచుకున్నారు. హుజూర్ నగర్ పురపాలక సంఘం భవన కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా హాజరయిన మంత్రి వర్గాలు మొక్కలు కూడా నాటాయి.  ఈ సందర్భం గా ఐటి శాఖా మంత్రి కేటీర్ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనపై ప్రశంసలు వర్షం కురిపించారు. కొత్త కొత్త సంస్కరణలతో పాలనను ప్రజల ముందు కు తీసుకొచ్చారన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
 
             ప్రజలందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని  కేటీర్ సంతోషం వ్యక్తం చేసారు. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోమని.. కఠినమైన నిర్ణయాలు అమలుచేస్తామని చెప్పుకొచ్చారు.  ఓ పక్క కరోనా మహమ్మారి వచ్చి.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. అయినప్పటికీ ఇంత కష్టకాలం లో కూడా కెసిఆర్ 54 లక్షల 22 వేల రైతులకు రూ.7 వేల కోట్లను రైతుబంధు కింద ఆర్థిక చేయూత ఇచ్చారని  కేటీర్ గుర్తు చేసారు.  ఆసరా పెన్షన్లను, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు  కూడా డబ్బులను మంజూరు చేస్తున్నామని కేటీర్ వెల్లడించారు. 
 
             అలానే..హుజూర్ నగర్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేశామని.. యువత కు మంచి ఉద్యోగాలు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు.  హైదరాబాద్ టు విజయవాడకు హై స్పీడ్ రైలు ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భం గా కేటీర్ చెప్పుకొచ్చారు. పార్టీలకు అతీతం గా తెలంగాణ ను అభివృద్ధి దిశగా పయనించేటట్లు ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పుడేమి ఎన్నికలు లేవని.. కేవలం తెలంగాణ అభివృద్దే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox