Breaking News

రోడ్ల రిపేర్ల పనిలో పడ్డ జిహెచ్ఎంసి..!

31 st Oct 2020, UTC
రోడ్ల రిపేర్ల పనిలో పడ్డ జిహెచ్ఎంసి..!

తెలంగాణ:ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు హైదరాబాద్ రోడ్లు బాగా పాడయ్యాయి. రోడ్లు, ఫ్లైఓవర్లు పాడవడం తో పెద్ద నష్టమే జరిగింది. భాగ్యనగరం లో మొత్తం 9,013 కిలోమీటర్ల విస్తీర్ణం తో రహదారులు ఉండగా 2,846 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, 6,167 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు ఉన్నాయి. అయితే భారీ వరదకు రోడ్లు దెబ్బ తినడం తో ప్రస్తుతం జిహెచ్ఎంసి వీటిని మరమ్మత్తులు చేయించే పని లో పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో 83 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బ తినగా వీటికి ప్రస్తుతం ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయనున్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నారు.

                 మరో 99 కిలోమీటర్ల మేర రోడ్లకు 52 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి వాటిని పునర్నిర్మించనున్నారు. సమగ్ర రహదారుల అభివృద్ధి పథకం కింద 83 కిలోమీటర్ల మేర మొదటి లేయర్ ను కూడా వేయించనున్నారు. హుస్సేన్ సాగర్ - సికింద్రాబాద్ మార్గంలో ఉన్న సర్ ప్లస్ నాలా కు సంబంధించిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 68 కోట్లను ఖర్చు పెట్టనున్నారు. రోడ్లను తిరిగి పునరుద్ధరించడానికి సరైన ప్రణాలికను రూపొందించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశించారు

                  ఇందుకోసం.ఇప్పటికే గ్రేటర్ లో 192 చెరువులను ఇంజనీర్ల బృందం పరిశీలించింది. వీటిలో.. కొన్ని చెరువులు పాక్షికం గా దెబ్బతిన్నాయి..మరో ఆరు చెరువులకు పూర్తి గా గండ్లు పడ్డాయి.అయితే.మరమ్మత్త పనులను వెంటనే మొదలు పెట్టడానికి జీహెచ్ఎంసి 41 కోట్లను ప్రత్యేకంగా విడుదల చేసింది.మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox