Breaking News

చేతల్లో సామాజిక న్యాయం చూపించిన పార్టీ టీఆర్ ఎస్.. కేటీఆర్

20 th Nov 2020, UTC

మాటల్లో సామాజిక న్యాయం కాదు. చేతల్లో సామాజిక న్యాయం చూపించిన పార్టీ టీఆర్ ఎస్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఇది అందరి హైదరాబాద్‌, అందరి కోసం ప్రభుత్వం పని చేస్తుంది’’ అని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మహిళా పక్షపాతి అని, జీహెచ్‌ఎంసీ చట్టాన్ని మార్చి 50 శాతం రిజర్వేషన్లను మహిళకు కేటాయించామని చెప్పారు. ఈ ఎన్నికల్లో వారికి 85 స్థానాలు ఇచ్చామని వెల్లడించారు.  

అదే విధంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, మైనార్టీ అభ్యర్థులకు 17 స్థానాలను ఇచ్చామని తెలిపారు. అన్ని కోణాల్లో పరిశీలించి అభ్యర్థుల ఎంపిక చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారికి సైతం 8 స్థానాలు కేటాయించామని, అంతేగాక రాజస్థానీ వాళ్లకు కూడా సీట్లు కేటాయించామన్నారు. మేము కూడా సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినవారమే అని ఆయన అన్నారు. అయితే టికెట్‌ రాని వారి ఇంటికి వెళ్లి వారి సహకారాన్ని కోరాలని కేటీఆర్‌ ఆభ్యర్థులను కోరారు

గిరిజనులకు 3 సీట్లు, మైనారిటీలకు 17, దళితులకు 13ఇతర రాష్ట్రాల వారికి 2  సీట్లలోనూ పోటీ చేయడానికి టీఆర్ ఎస్ అవకాశం ఇచ్చిందన్నారు. పార్టీలో 60 లక్షల మంది సైనికులు ఉన్నారు..హైదరాబాద్ నగర అభివృద్ధి ని ప్రజలకు వివరించాలి. ఏ రంగంలో ఎంత ఖర్చు చేశామో మీరు చేసిన అభివృద్ధి చెప్పాలి. 90 నుంచి 95 శాతం మంచి నీటి సమస్య లేకుండా చేశాం.104 సంవత్సరాల క్రితం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గండిపేట కట్టారు.తరువాత చాలా మంది పాలించారు. ఎవరు నీటి సమస్య పై ఆలోచన చేయలేదు. సీఆర్ ఆలోచన చేశారు.కేశవ పూర్ ప్రాజెక్టుద్వారా 2050 వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. శాంతి భద్రతలు అదుపులో ఉంటే రాష్ట్రనికి పెట్టుబడులు వస్తాయి. తెలంగాణ ఆర్ధిక ఇంజన్ హైదరాబాద్ ఈ విషయం ప్రజలకు అర్దమయ్యేలా పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్దులు చెప్పాలని కేటీఆర్ కోరారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox