Breaking News

బల్దియా ఎన్నికలకు సర్వం సిద్ధం: సైబరాబాద్ సీపీ సజ్జనార్

30 th Nov 2020, UTC

హైదరాబాద్ :బల్దియా ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. రేపు ఉదయం ఏడు గంటలనుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లను చేసారు. తాజాగా, జీహెచ్ఎంసి ఎన్నికల విషయమై సైబరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడారు. "బల్దియా ఎన్నికల కోసం 13,500 వేల మంది పోలీసులతో అన్ని భద్రత పరమైన ఏర్పాట్లు చేసాము. వీరిలో 10,500 సివిల్, 3000 మంది ఏఆర్ (Armed Reserve) సిబ్బంది ఉంటారు." అని సజ్జనార్ తెలిపారు.

పోలీస్ సిబ్బందికి మూడు సార్లు తర్ఫీదు ఇచ్చామన్నారు.స్టేట్ ఎలక్షన్ కమీషన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. నిన్న అనగా 29.11.2020 రోజు సాయంత్రం 6 గంటల వరకూ ఎన్నికల ప్రచారం ముగిసింది. నార్మల్, సెన్సిటివ్,  హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐ, సిఐ స్థాయి అధికారి,  ఏసీపీ, ఏడీసీపీ, డీసీపీల నేతృత్వంలో భద్రత ఏర్పాటు చేశాం అని సజ్జనార్ వివరించారు. 38 స్ట్రైకింగ్ ఫోర్స్, 11 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 9 సీపీ రిజర్వ్ టీమ్స్, 11 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 11 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లు అందుబాటులో ఉంటారని తెలిపారు.

73 హైపర్ సెన్సిటివ్ పికెట్ లు నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసామన్నారు. హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద 1 ఎస్ ఐ, 4 ఏఆర్ సిబ్బంది ని ఏర్పాటు చేశామని తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ లో 38 వార్డ్ లు ఉన్నాయి.  2437 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే, వీటిలో 1421 నార్మల్  పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి. 766 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి. 250 అత్యంత సమస్యాత్మక/ Hyper Sensitive పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి. 177 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని సిపి సజ్జనార్ వివరించారు. సైబరాబాద్ లో 15 బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం. హైపర్ సెన్సిటివ్ ఏరియా ల్లో 73 పికెట్ లు ఏర్పాటు చేశాం. 587 లైసెన్సేడ్ గన్స్ డిపాజిట్ చేయడం జరిగింది. 369 మంది రౌడీ షీటర్ లను బైండోవర్ చేశాం. రూ. 15 లక్షలు  విలువ చేసే 396 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం అని సిపి సజ్జనార్ తెలిపారు. 

ప్రతి పోల్ల్లింగ్ స్టేషన్ కు జియో ట్యాగింగ్ చేశాం. సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం అని సజ్జనార్ వివరించారు. పెండింగ్ లో ఉన్న 24 మంది పై నాన్ బెయిబుల్ వారెంటిలు ఎక్జి క్యూట్ చేశాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిసిటివి లు ఏర్పాటు చేసి వాటిని ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారా అనుసంధానం చేశాం. జియో ట్యాగింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాన్ని అనుసంధానం చేసాము. 1 లక్ష సీసీ కెమెరాలు ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను మానిటరింగ్ చేస్తున్నాము. డిసిపి, ఏ సిపి ఆఫీస్ లో రౌండ్ ది  క్లాక్ నిరంతర పర్యవేక్షణ లో ఉంచామని సిపి సజ్జనార్ చెప్పుకొచ్చారు. ఎన్నికల అనంతరం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ వద్ద నిఘా ఉంచాము. రేపు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఓటర్ లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి..ఎలక్షన్ ఏజెంట్ కి ప్రత్యేక వాహనం అనుమతి ఉండదు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ ల వద్ద ఓటర్ లు తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి. ఓటర్ లను తరలించడం చట్ట విరుద్ధం అలా చేస్తే వాహనాలు సీజ్ చేయబడతాయి. కోవిడ్ నియమ నిబంధనలు పాటించి ఓటింగ్ లో పాల్గొనాలి అని సిపి సజ్జనార్ ఓటింగ్ నియమ నిబంధనలను వివరించారు. మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox