Breaking News

విద్యుత్ బిల్లులపై సర్వత్రా అపోహలు..క్లారిటీ ఇచ్చిన మంత్రి..!

09 th Jun 2020, UTC
విద్యుత్ బిల్లులపై సర్వత్రా అపోహలు..క్లారిటీ ఇచ్చిన మంత్రి..!
ఈనెల కరెంటు బిల్ ఎక్కువ రావడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కరోనా కాలం కావడం తో ఆదాయాలు లేక ఇబ్బందులు పడేవారికి ఈ కరెంట్ బిల్లు శిరో భారం అవుతోంది. మరో వైపు.. గత రెండు నెలలు గా రీడింగ్ తీయకపోవడం తో ఈసారి రీడింగ్ తీసాక ఎక్కువ వినియోగం కావడం తో స్లాబు మారి  బిల్ ఎక్కువ వస్తుందని.. గత రెండు నెలల్లో కట్టిన అమౌంట్ ను తీసివేసి మిగతా బిల్  ను కట్టాల్సి ఉంటుంది అని.. ఇలా రకరకాలుగా చెప్పుకోవడం తో కరెంటు బిల్ విషయమై గందరగోళం నెలకొంది. 
 
         అయితే.. దీని విషయమై విద్యుత్ శాఖ మంత్రి  జగదీశ్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. అనుమానాల నివృత్తికి ప్రతి ఈఆర్‌వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం)లో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వినియోగం పెరిగే కొద్దీ కేటగిరి మారిందన్నారు. సాధారణ రోజుల కన్నా వేసవి వినియోగం 30-40ు దాకా ఎక్కువ ఉంటుందని, లాక్‌డౌన్‌తో 15-20ు అదనపు వినియోగ ం నమోదైందని తెలిపారు. నిన్న..ఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. 
 
        ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. బిల్లుని 30, 40, 30% చొప్పున వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇస్తున్నామని చెప్పారు. రెగ్యులర్‌ బిల్లులతో పాటు బకాయిలు కట్టాలన్నారు. అపరాధ రుసుం   చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సరాసరి బిల్లుల వల్ల కొందరికి ప్రయోజనం, మరికొందరికి నష్టం జరిగే అవకాశాలున్నాయని చెప్పారు.   మూడు నెలల రీడింగ్ ను.. మూడు భాగాలుగా చేసి ఒక్క యూనిట్ ను కూడా ఎక్కువ వేయలేదని తెలిపారు. ఈ కరెంటు బిల్లుల విషయమై ఎమ్మెల్యేలకు  ఆందోళన ఉందని అన్నారు. మూడు నెలలకు రూ.21 వేల విద్యుత్తు బిల్లు రావడంతో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా గాబరా పడ్డారని అన్నారు. ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కు పద్దెనిమిది వేల బిల్లు వచ్చిందని...ఎమ్మెల్యే సైదిరెడ్డి కి నలభై ఐదు వేల బిల్లు వస్తే తన వద్దకు వచ్చారని.. వారికీ అనుయాణాలను నివృత్తి చేసానని మంత్రి చెప్పుకొచ్చారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox