Breaking News

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేష‌న్‌ నిలిపివేసిన ఎన్నికల కమీషన్

13 th Jan 2022, UTC

YSR Telangana party: తండ్రి ఆశ‌య సాధ‌నే ల‌క్ష్య‌మంటూ తెలంగాణ‌లో కొత్త పార్టీ స్థాపించిన వైఎస్ ష‌ర్మిల‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేష‌న్‌కు అడ్డంకులు ఏర్ప‌డ్డాయి. వైఎస్ఆర్‌టీపీ పేరు రిజిస్ట్రేష‌న్‌కు... అభ్యంత‌రాలు వ‌చ్చాయ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలిపింది. ఇప్ప‌టికే ‘అన్న వైఎస్ఆర్’ పార్టీని స్థాపించిన వారు ఈసీకి అభ్యంతరాలు తెలపడంతో షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్‌ను ఎలక్షన్ కమిషన్ నిలిపివేసింది.

 వైఎస్ఆర్‌టీపీ పేరు త‌మ పార్టీని పోలి ఉందంటూ అన్నా వైఎస్ఆర్ పార్టీ అధ్య‌క్షుడు షేక్ బాషా ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు గ‌త న‌వంబ‌ర్‌లో ఫిర్యాదు చేశారు. బాషా ఫిర్యాదును స్వీక‌రించిన ఈసీ.. వైఎస్ఆర్‌టీపీ గుర్తింపుపై ప‌రిశీలిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదే విషయాన్ని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి రాతపూర్వకంగా తెలియజేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ పేరు తమ పార్టీ పేరును పోలి ఉందంటూ, ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ‘అన్న వైయస్సార్ పార్టీ’ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 

తెలంగాణ‌లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆశ‌యాల సాధ‌నే ల‌క్ష్యంగా గ‌త ఏడాది వైఎస్ఆర్ జయంతి సంద‌ర్భంగా షర్మిల వైఎస్ఆర్‌టీపీ పార్టీని ప్రారంభిచింది. అదేరోజు పార్టీ జెండాను ఆవిష్క‌రించిన ష‌ర్మిల‌.. తెలంగాణ‌లో ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌లై త‌నదైన శైలిలో స్పందిస్తున్నారు. దీక్ష‌ల పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు. ఇప్పుడు పార్టీ రిజిస్ట్రేషన్‌కు అడ్డంకులు ఏర్పడడంతో షర్మిల ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది

మరిన్ని రాజకీయ వార్తలు చదవండి

 సినీ పరిశ్రమకు అండగా వుంటాము.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
URL - we-support-the-film-industry-..-minister-talasani-srinivasa-yadav

రేవంత్ రెడ్డిలో టెన్షన్ మొదలయిందా?
URL - did-tension-start-in-rewanth-reddy

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox