Breaking News

హై కోర్ట్ ఆదేశాలపై స్పందించిన ఈటెల..!

09 th Jun 2020, UTC
హై కోర్ట్ ఆదేశాలపై స్పందించిన ఈటెల..!
కరోనా మహమ్మారి నేపధ్యం లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అధిక సంఖ్యలో పరీక్షలు జరుపుతున్నాయి. కొందరి లో కరోనా లక్షణాలు కనపడకపోయినా.. కరోనా సోకినా వ్యక్తి తో ఎలాంటి కాంటాక్ట్ లేకపోయినా వారి లో కూడా కరోనా పాజిటివ్ వస్తుండడం తో కొన్ని రాష్ట్రాలైతే.. ఇంటింటి సర్వే ను కూడా చేపడుతున్నాయి. అయితే.. తెలంగాణ లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం గా ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారు, కరోనా ఎక్కువ గ ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారిని తప్ప ఇతరులెవరికి ఈ పరీక్షలు జరపడం లేదు..
 
            దీనితో సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.. మరోవైపు.. మీడియా కు తప్పుడు లెక్కలు ఇస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఓ సారి హై కోర్ట్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మరిన్ని పరీక్షలు జరపాల్సింది గా సూచించింది. మరణించిన వారికీ కూడా.. కరోనా తో మరణించారా లేదా? అనేది తెలుసుకోవడం కోసం.. వారికీ కూడా పరీక్షలు జరపాలని హై కోర్ట్ ఆదేశించింది. అయితే.. ప్రభుత్వం కూడా పరీక్షల సంఖ్యా ను మరింత పెంచిన సంగతి తెలిసిందే. అయినప్పటికి హై కోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరణించిన వారికీ కూడా పరీక్షలు జరపాలన్న తమ ఆదేశాలు అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై.. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు.
 
          చనిపోయిన వారికీ కరోనా పరీక్షలు జరపాలని చెప్పడం అవగాహనా రాహిత్యం తో కూడుకున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐసిఎమార్ నిబంధనల్లో ఎక్కడ మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని చెప్పలేదని ఆయన వాదించారు. రాష్ట్రము లో నిత్యం వేయి మంది మరణిస్తున్నారు. దేశం లో నిత్యం ముప్పై వేల మంది మరణిస్తున్నారు. అయితే.. వారందరికీ టెస్టులు చేయాలంటే అది సాధ్యం అయ్యే పని కాదని ఈటెల అన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox