Breaking News

తెలంగాణ ఈఎస్ఐ స్కామ్‌లో రూ.144 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

23 rd Nov 2021, UTC

తెలంగాణ ఈఎస్ఐ స్కామ్‌లో  రూ.144 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో 97 ఫ్లాట్స్, 6 విల్లాలు, 18 కమర్షియల్ షాపులను అటాచ్ చేసినట్లు పేర్కొంది. తెలంగాణ ఏసీబీ కేసుల ఆధారంగా ఈడీ విచారణ జరిపింది. మనీలాండరింగ్ కింద తాజాగా ఆస్తులను అటాచ్ చేసింది. 

ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి , శ్రీహరిబాబు, రాజేశ్వర్ రెడ్డి, కె పద్మ, నాగలక్ష్మి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. దీనిలో భాగంగా హైదరాబాద్ , బెంగళూరు, నోయిడా, చెన్నైలలో ఆస్తులను జప్తు చేసింది. వీటిలో దేవికారాణికి సంబంధించిన రూ.6.28 కోట్ల నగలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. అంతేకాకుండా పెద్ద మొత్తంలో నగదును కూడా ఈడీ ఫ్రీజ్ చేసింది.

దేవికారాణి, ముకుందారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరిబాబులు కలిసి ఈ స్కామ్‌కు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. హవాలా, మనీలాండరింగ్ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు మళ్లీంచినట్లు ఈడీ గుర్తించింది. వీటిని పలు ఫార్మా కంపెనీలతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్‌లలోనూ పెట్టుబడులు పెట్టినట్లుగా  ఈడీ నిర్థారించింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox