Breaking News

మందుబాబులా మజాకానా.. ఒక్కరోజే రూ.200 కోట్ల లిక్కర్ తాగేసారు.

17 th Oct 2021, UTC

దసరా పండుగను హైదరాబాద్ నగర ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. కోవిడ్ కారణంగా ఏడాదిన్నరగా పండుగలు, ఉత్సవాలకు దూరమైన ప్రజలు దసరాకు చుక్క, ముక్కతో పసందు చేసుకున్నారు. దీంతో నగరంలో చికెన్, మటన్, మద్యం విక్రయాలు భారీ స్థాయిలో జరిగాయి. హైదరాబాద్‌లో ఒక్క వారం రోజుల్లోనే రూ.222.23కోట్ల మద్యం విక్రయాలు జరిగాయంటేనే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంగళ, బుధ, గురువారాల్లోనే రూ.75కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లాల పరిధిలో 7.78 లక్షల కేసుల లిక్కర్, మరో 2.36 లక్షల కేసులు బీర్లు అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ దసరాకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. దసరా సందర్భంగా ఒక్కరోజే దాదాపు రూ.180 కోట్ల మద్యాన్ని దిగుమతి చేసుకోగా.. గతంలో ఉన్న స్టాక్‌తో కలిసి రూ.200 కోట్ల మద్యం అమ్ముడయిందని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఇంతకుముందు కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన రోజు రూ.130 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయని, ఆ తర్వాత ఈ దసరాకే భారీగా మద్యం అమ్ముడయుందని పేర్కొన్నారు. గత ఏడాది దసరాతో పోల్చితే ఈసారి లిక్కర్‌ విక్రయాల్లో 39 శాతం, బీర్లలో 57 శాతం వృద్ధిరేటు నమోదయిందని వివరించారు. పైగా ఈ సారి దసరా సందర్భంగా ఈ నెల 12 నుంచి 16 (శనివారం) వరకు ఐదు రోజుల్లోనే రూ.685 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం. దీంతో ఎక్సైజ్‌ శాఖకు జోరుగా ఆదాయం వచ్చింది. గత ఏడాది దసరా సందర్భంగా ఈ అమ్మకాలు రూ.406 కోట్ల దాకా జరిగాయి. 

గ్రేటర్‌ పరిధిలో సాధారణంగా రోజుకు 10 లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే గురు, శుక్రవారాల్లో కలిపి దాదాపు 50 లక్షల కిలోల చికెన్‌ విక్రయాలు జరిగినట్లు హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. దసరా సందర్భంగా గ్రేటర్‌ ప్రజలు మటన్‌ కంటే ఎక్కువగా చికెన్‌కే ప్రాధాన్యమిచ్చినట్లు అమ్మకాల లెక్కల ద్వారా తెలుస్తోంది. మటన్‌ ధర కిలో రూ. 750– 800 ఉండటం.. చికెన్‌ ధర రూ.200-250 మధ్య ఉండటంతోనే ప్రజలు చికెన్‌పైనే మక్కువ చూపారు. నగరంలో గత మూడ్రోజుల్లో 10-15లక్షల కిలోల మటన్ విక్రయాలు జరిగినట్లు అధికారుల అంచనా.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox