Breaking News

విందుల పేరుతో జీవితాలతో ఆడుకోవద్దు.. బండ్ల గణేష్

13 th Sep 2021, UTC

మా ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నటుడు, నిర్మాత బండ్ల‌గ‌ణేష్  ఆదివారం త‌న ట్విట్ట‌ర్‌లో ఒక  వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ఇందులో విందులు, సన్మానాలంటూ ర‌క‌ర‌కాల పేర్ల‌తో మా కళాకారులను ఒక‌చోట చేర్చ‌కండి. గత రెండేళ్ల నుంచి అంద‌రూ క‌రోనా భయంతో ఉన్నారు. నాలాంటివాళ్లు చాలా మంది చావు దాకా వెళ్లి వ‌చ్చారు. మీకు ఓటు కావాలంటే మా స‌భ్యుల‌కు ఫోన్ చేసి మీరు చేసే, చేయ‌బోయే అభివృద్ధి కార్య‌క్ర‌మాలు గురించి చెప్పండి. అంతే కానీ..ఈ విందుల పేరుతో ఓ ద‌గ్గ‌ర‌కు చేర్చి వారి జీవితాల‌తో చెల‌గాటాలు ఆడొద్ద‌ని నా విన్న‌పం అని అన్నారు.

కొద్దిరోజుల కిందట  మా ఎన్నికల్లో  మంచు విష్ణుకు స‌పోర్ట్ చేస్తున్న సీనియ‌ర్ న‌టుడు.న‌రేష్  విందు సమావేశాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు వార్త‌లు వచ్చాయి.తాజాగా ప్రకాష్ రాజ్ కూడ విందు సమావేశం ఏర్పాటు చేసినట్లు  తెలిసింది. దీనిపై బండ్ల గణేష్ ఈ విధంగా స్పందించారు.

మా ఎన్నికల్లో మొదట  ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లోనే ఉన్న బండ్ల గ‌ణేశ్‌, జీవితా రాజ‌శేఖ‌ర్ రాక‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. అంతే కాకుండా ప్రధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి పోటీ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 10న మా ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox