Breaking News

యాసంగిలో వరిపంట వేయవద్దు.. తెలంగాణకు స్పష్టం చేసిన కేంద్రం

27 th Nov 2021, UTC

తెలంగాణలో యాసంగిలో వరిపంట వేయవద్దని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో  శుక్ర‌వారం తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి  ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు  మ‌ల్లారెడ్డి  ఎంపీలు నామా నాగేశ్వ‌ర్ రావు బీబీ పాటిల్, సురేశ్ రెడ్డి పాల్గొన్నారు. 

సమావేశం అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం గట్టిగా చెప్పిందన్నారు. తాము ఎంతో ఆశతో వచ్చామని.. కానీ కేంద్రం నిరాశపరిచిందని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించామని.. ఎంత కొనుగోలు చేస్తుందో టార్గెట్ చెప్పమన్నామని ఆయన తెలిపారు. ఏడాదికి ఒకేసారి టార్గెట్ ఇవ్వలేమని కేంద్రం చెప్పిందని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. భేటీ వివరాలను సీఎం కేసీఆర్‌కు వివరిస్తామని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటామని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 

 వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం తీరుపై టీఆర్ఎస్  పోరాటం  చేస్తోంది. ఇప్పటికే ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నాకు దిగింది టీఆర్ఎస్. కేంద్రం నుండి రెండు మూడు రోజుల్లో స్పష్టత రాకపోతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఇందిరా పార్క్ వద్ద మహ ధర్నా సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox