Breaking News

మార్చిలోపే దళితబంధు నిధుల పంపిణీ .. సీఎం కేసీఆర్

05 th Oct 2021, UTC

దళిత బంధు పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటామని సీఎం  కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో దళితబంధు పథకంపై జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దళిత బంధు హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం తీసుకొచ్చింది కాదని  కేసీఆర్ తేల్చి చెప్పారు.  కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దళితుల పరిస్థితి దయనీయంగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.అణచివేతకు గురైన వర్గాలకు ఇప్పటికీ సాధికారిత చేకూరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  గతంలో ఉన్న ప్రభుత్వాలు  కొంత చేశాయని ఆయన తెలిపారు.దళితుల గురించి కాంగ్రెస్ ఏం చేయలేదని అనలేమని, వారు చేసేది చేశారని, అయితే అనుకున్నంత జరగలేదనేది తమ వాదన అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

మార్చిలోపే రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి దళిత బంధు అందజేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకే అప్పగిస్తున్నామన్నారు. వచ్చే మార్చిలో రూ. 20 వేల కోట్లు బడ్జెట్‌లో పెడతామన్నారు. రూ.10 లక్షలు లబ్ధిదారుల ఇష్టమని, నిబంధనలు లేవని, ఎక్కడైనా వ్యాపారం పెట్టుకోవచ్చునని, తమకెలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగిపోయాయని ఎకరం భూమి రూ.20 లక్షలకు తక్కువ ఎక్కడ దొరకడం లేదన్నారు.

వర్గీకరణ చేయాలని ఇప్పటికే ప్రధానికి చాలాసార్లు చెప్పానన్నారు. కేంద్రంలో ఉన్నారు కదా.. వర్గీకరణ చేసి తీసుకువస్తే.. బేగంపేట నుంచి పెద్ద పెద్ద దండలు వేసి స్వాగతం పలుకుతామన్నారు.  రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం టీఆర్ఎస్‌కి రావొచ్చని కేసీఆర్ అన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox