Breaking News

రేవంత్ రెడ్డిలో టెన్షన్ మొదలయిందా?

12 th Jan 2022, UTC
 రేవంత్ రెడ్డిలో టెన్షన్ మొదలయిందా?

Rewanth Reddy: కరోనా నుండి కోలుకున్న వెంటనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో ప్రత్యక్షమవ్వడానికి కారణం ఏంటి..? ..సీఎల్పీ భేటీ తో రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారా...? .ఉన్న ఫలంగా డీసీసీ అధ్యక్షులతో సమావేశమవ్వడానికి అవడానికి కారణం అదేనా...? ..అధిష్టానం హెచ్చరికలతో రేవంత్ రెడ్డి లో టెన్షన్ మొదలైందా...?...దీనిపై కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తు్న్న టాక్ ఏంటి?

తెలంగాణ కాంగ్రెస్‌లో తాజాగా  సీఎల్పీ సమావేశం సందర్భంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుండగానే... రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులతో సమావేశమవ్వడం చర్చనీయాంశంగా మారింది... పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి డీసీసీ అధ్యక్షులను కలుపుకొని ముందుకు వెళ్లిన సందర్భాలు తక్కువే .. దీంతో పీసీసీపై జిల్లా పార్టీ అధ్యక్షులు అసంతృప్తిగా ఉన్నారు.అయితే పీసీసీ, డీసీసీలకు మధ్య గ్యాప్ పెరగడంపై అధిష్టానం హెచ్చరికలతో రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు... డిజిటల్ మేంబర్షిప్ ప్రారంభించి నెల రోజులు దాటుతున్న డీసీసీ అధ్యక్షులు పూర్తి స్థాయిలో పని చేయడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.. దీనికి కారణం రేవంత్ రెడ్డికి డీసీసీలకు మధ్య ఉన్న గ్యాప్ కారణంగానే ...వారు లైట్ తీసుకున్నారనే వార్తలు గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.డిజిటల్ మేంబర్‌షిప్‌లో 30 లక్షల టార్గెట్ చేసి చూపిస్తామని అధిష్టానానికి మాట ఇచ్చారు రేవంత్. కానీ డిసిసి అధ్యక్షుల తీరుతో ఇప్పటి వరకు 10 లక్షల మార్కును కూడా చేరుకోలేకపోయారు ... మరో 15 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పీసీసీ వర్గాల్లో టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తోంది ... అందుకే ఉన్న ఫలంగా గాంధీ భవన్ లో డీసీసీ అధ్యక్షుల  సమావేశం ఏర్పాటు చేసి కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తుంది.పార్టీ అంతర్గత కుమ్ములాటల వల్ల పార్టీ నష్టపోతుందని ... అందరం కలిసి పార్టీ కోసం పని చేద్దామని, జిల్లా అధ్యక్షులకు కూడా పీసీసీ సమయం కేటాయించాలని రేవంత్ రెడ్డిని జాల్లా అధ్యక్షులు కోరారంట... జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సిద్ధం చేసి ఉంచాలని జిల్లా అధ్యక్షులకు పీసీసీ చీఫ్ సూచించారట... అవసరమైతే ఆయా జిల్లాల్లోని సమస్యలపై మీకు అండగా పీసీసీ బృందం సైతం అక్కడికి వచ్చి పోరాడడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చినట్లు సమాచారం... ఇక నుండి డీసీసీలకు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తానని వెల్లడించారట.

డీసీసీ సమావేశంలో డిజిటల్ మేంబర్‌షిప్‌పై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం... ఇప్పటి వరకు మీ జిల్లాల పరిధిలో ఎంత వరకు పూర్తి చేశారు... గడువు సమయం దగ్గర పడుతుండడంతో మరింత కష్టపడాలని రేవంత్ సూచించారట... మండలాలు , అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా డిజిటల్ మెంబర్‌షిప్‌లో కష్టపడి పని చేసిన వారికి సరైన గుర్తింపుతో పాటు... రాహుల్ గాంధీ తో ప్రత్యేక ఇంట్రాక్షన్ ఉంటుందని గతంలోనే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.... గతంలో పేపర్లపై సభ్యత్వ నమోదు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని .. ఇప్పుడు డిజిటల్ మేంబర్షిప్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్న కారణంగా అనుకున్న స్థాయిలో చేయలేకపోయామని జిల్లా అధ్యక్షులు పీసీసీ చీఫ్‌కి తెలిపారు.కాంగ్రెస్ లో అంతర్గత విబేధాలతో అప్రమత్తమైన సీఎల్పీ .. రేవంత్ రెడ్డికి కరోన రావడంతో ఆ సమయాన్నివరంగా మార్చుకోవాలని అనుకుంది... అందులో భాగంగా సీఎల్పీ ప్రత్యేక కార్యాచరణ సైతం ప్రకటించారు... ఇది జరిగిన మరుసటి రోజే రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌లో ఇప్పటి వరకు తన మీద అసహనంతో ఉన్న డీసీసీ ప్రెసిడెంట్లతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పుడు కాంగ్రెస్  వర్గాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది.... అంతా కలిసి పోరాడుతామని చెప్తున్న కాంగ్రెస్‌లో ... ఒకవైపు పీసీసీ , మరోవైపు సీఎల్పీ వేరువేరు సమావేశాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవడం ... కార్యకర్తల్లో గందరగోళ స్థితికి కారణమవుతోంది .... పీఏసీ సమావేశంలో సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా ముందుకు సాగుతామంటూ ఇంచార్జ్ ఠాగూర్ కి చెప్పినప్పటికీ..కాంగ్రెస్ నేతల తీరులో మాత్రం మార్పులేదు ..దీనికి ఉదాహరణే సీఎల్పీ , డీసీసీల సమావేశం అంటున్నారు.

మరిన్ని రాజకీయ వార్తలు చదవండి

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox