Breaking News

ధరణి పోర్టల్ ప్రారంభం మళ్ళీ వాయిదా..!

23 rd Oct 2020, UTC
ధరణి పోర్టల్ ప్రారంభం మళ్ళీ వాయిదా..!

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాతిష్టాత్మకం గా ప్రారంభించిన  ధరణి పోర్టల్ మరో సారి వాయిదా పడింది.. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఇటీవల  దసరా రోజు ధరణి పోర్టల్ ప్రారంభం ఉంటుందని  ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ప్రారంభం మరోసారి వాయిదా పడింది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభం ఉంటుందని ప్రకటించారు. అయితే.. కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు, వరదలకు ధరణి పోర్టల్ ఆస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయడం ఆలస్యమైంది. దీనితో.. ధరణి పోర్టల్ ప్రారంభోత్సవాన్ని మరోసారి వాయిదా వేశారు.

ధరణి పోర్టల్ వచ్చాక.. రాష్ట్రంలో వ్యవసాయ భూమలు, ఇళ్ల భూముల తో కలిపి అన్ని ఆస్తుల వివరాలను ఇందులో పొందుపరచాలని సీఎం కెసిఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కసరత్తులు చేస్తున్నారు. అయితే.. ఈ పోర్టల్ ప్రారంభానికన్నా ముందు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా భూముల విలువలను ఖరారు చేయాలనీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే స్పష్టం చేసారు. అలాగే.. రిజిస్ట్రేషన్లు కూడా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే జరుగుతాయన్నారు. తహశీల్దారు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్ లు ఇచ్చి వారికి  డాక్యుమెంట్లను సిద్ధం చేసేవిధం గా శిక్షణను ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం దసరా లోపు పూర్తవ్వాలని కెసిఆర్ ఆదేశించారు. ఆ తరువాత మార్పులు చేర్పులు ఉంటె.. వెంటనే సరిచేయాలని ఆదేశించారు. కానీ వరదల కారణం గా ఈ ప్రక్రియ ఆలస్యమైంది. మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox