Breaking News

ధరణి పోర్టల్‌ దేశానికే ట్రెండ్‌ సెట్టర్‌.. సీఎం కేసీఆర్ 

29 th Oct 2020, UTC

హైదరాబాద్ :ధరణి పోర్టల్‌ దేశానికే ట్రెండ్‌ సెట్టర్‌ అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ధరణి పోర్టల్‌  రెవెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పు అని ఆధార్‌ నెంబర్‌తోనే అన్ని వివరాలు లభ్యమవుతాయని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ధరణి వెబ్ పోర్టల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అధికారికంగా ప్రారంభించారుమూడుచింతలపల్లిలో ధరణి వెబ్ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం. ఒకప్పుడు భూమి ఉత్పత్తి సాధనం మాత్రమేనని, వ్యవసాయం ప్రారంభించిన తర్వాత భూమికి విలువ పెరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ కోసమే ధరణి పోర్టల్‌ ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక తప్పు జరిగితే భవిష్యత్‌ తరాలు ఇబ్బందులు పడతాయని, తప్పటడుగులు లేకుండా రైతుల కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదని వెనక్కు పడేయబడ్డ రాష్ట్రమని కేసీఆర్‌ అన్నారు.

మిషన్‌ భగీరథతో శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించామని, మారుమూల ప్రాంతాలకు కూడా మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందించామని సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్‌ భగీరథపై అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారని, అయినా వెనుకడుగు వేయకుండా సంకల్పబలంతో మిషన్‌ భగీరథను పూర్తి చేశామన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌ 1గా ఉందని, వ్యవసాయ రంగం సహా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామన్నారు. ఎఫ్‌సీఐకి 55 శాతం ధాన్యం అందించిన రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా వారి భూముల వివరాలు చూసుకోవచ్చునని అన్నారు. ధరణి పోర్టల్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు ఉండదని, ధరణి పోర్టల్‌ రూపకల్పన కోసం 200 సమావేశాలు నిర్వహించామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

ఇక మీదట తెలంగాణలో వ్యవసాయ భూములన్నీ ఎమ్మార్వో కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌‌తోపాటు మ్యుటేషన్ కూడా జరిగే విధంగా ధరణి వెబ్ సైట్లో మార్పులు చేశారు. ఎమ్మార్వో ఆఫీసులో 15 నిముషాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 570 ఎమ్మార్వో కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ జరగాలంటే ఇకపై భూమిని విక్రయించేవారు, కొనుగోలు చేసేవారు ఇద్దరూ తహసీల్దార్‌ ఎదుట హాజరు కావాల్సిందే. ఇప్పటిదాకా సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూమిని కొనుగోలు చేసేవారు లేకున్నా తన ప్రతినిధి (రిప్రజెంటేటివ్‌)ను పంపిస్తే రిజిస్ట్రేషన్‌ జరిగేది. ఇకపై అలా సాధ్యంకాదు. అంతే కాకుండా భూములు కలిగినవారు ఎవరికైనా జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) లేదా స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(ఎస్‌పీఏ) ఇస్తే, యజమానుల తరఫున వీరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి, రిజిస్ట్రేషన్‌ చేయించడాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox