Breaking News

కారును ఓడించండి.. హస్తాన్ని  గెలిపించండి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

24 th Oct 2020, UTC

దుబ్బాక ఉప ఎన్నిక కారణంగానే రైతులకు, ఉద్యోగులకు కేసీఆర్  హామీలు  ఇస్తున్నాడని  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మొక్కజొన్న పంటలే వేయొద్దని 1200 రూపాయలకు క్వింటాలు దేశమంతా దొరుకుతున్నయని మాట్లాడిన కేసీఆర్ నేడు గ్రామాలలో మీ దగ్గరే వచ్చి మొక్కజొన్నలు 1850 మద్దతు ధరకు కొంటామని అంటున్నారు. మొన్నటి వరకు కుక్క తోక అంటూ ఉద్యోగులను అవహేళనగా మాట్లాడిన కేసీఆర్ నేడు డీఏ ప్రకటించారు. మనం దుబ్బాకలో ఓడగొడితే ఇక అన్ని చేస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు.

దుబ్బాకలో టీఆర్ ఎస్ ఓడితేనే దళితులకు భూమి వస్తుంది, డబల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తుంది.  ఆరోగ్య శ్రీ వస్తుంది. ఇంటికో ఉద్యోగం వస్తుంది, ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల్ వస్తాయి, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య వస్తుంది, అన్ని వస్తాయి. కేసీఆర్ దుబ్బాకలో ఓట్ల కోసమే రైతులకు, ఉద్యోగులకు మంచి చేస్తున్నట్లు నటిస్తున్నాడు. ఇక్కడ కార్‌ను గెలిపిస్తే మళ్ళీ లెక్కలు ఓట్లు అయ్యాక మోసం చేస్తారని ఆయన అన్నారు.

ఉద్యోగులకు ఇంకా రెండు డీఏలు ఇవ్వలేదు. పీఆర్‌సీ ఇవ్వలేదు. రైతులకు రుణ మాఫీ ఇవ్వలేదు. పంటలు పాడైతే నష్ట పరిహారం ఇవ్వలేదు. కౌలు రైతులకు రైతు బంధు రావాలి. అన్ని పంటలను గిట్టుబాటు ధరలకు కొనాలి. ఇవన్నీ అమలు కావాలంటే దుబ్బాకలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ అంతటా ప్రజలకు న్యాయం జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox