Breaking News

CM KCR : వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన

04 th Aug 2021, UTC

Vasalamarri :దత్తత గ్రామం వాసాలమర్రిలో తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు  పర్యటించారు. దళితవాడల్లో కాలినడకన ఇంటింటికి వెళ్లి దళితబంధు పథకం గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు పథకంతో వచ్చే పెద్ద మొత్తం డబ్బుతో ఎలాంటి ఉపాధి పొందుతారని దళితులను ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో వచ్చే డబ్బును వృధా చేసుకోవద్దని, స్పష్టమైన అవగాహనతో దళితబంధు ద్వారా లబ్ధి పొందాలని సీఎం సూచించారు. సుమారు మూడు గంటలకుకు పైగా దళితవాడల్లో కాలినడకన సీఎం తిరిగారు.

మ‌హిళ‌లు, వృద్ధుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అప్ప‌టిక‌ప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఆసరా పెన్ష‌న్ల‌ పై ఆరా తీశారు. పెన్ష‌న్ రాని వారికి వెంట‌నే మంజూరు చేయాల‌ని కేసీఆర్ ఆదేశించారు.పెన్ష‌న్ అంద‌డం లేద‌ని చెప్పిన 20 మంది బీడీ కార్మికుల‌కు రెండు రోజుల్లో పెన్ష‌న్ అందించాల‌ని ఆదేశించారు. ఇండ్లు లేని వారంద‌రికీ డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు.

వాసాల‌మ‌ర్రి ప‌ర్య‌ట‌న‌లో సీఎం కేసీఆర్ వెంట ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత‌, మండ‌లి మాజీ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తితో పాటు ప‌లువురు అధికారులు ఉన్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox