Breaking News

కేంద్రానికి సిఎం కెసిఆర్ లేఖ..!

04 th Jun 2020, UTC
కేంద్రానికి సిఎం కెసిఆర్ లేఖ..!
విధ్యుత్ బిల్లుల చట్టాన్ని కేంద్రం సవరించిన నేపధ్యం లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రానికి లేఖ రాసారు. ప్ర‌తిపాదిత విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లు-2020పై రాష్ట్రాలు అభిప్రాయాలను తెలపాలని కేంద్రం కోరింది. ఈ నేపధ్యం లో సీఎం కెసిఆర్ కూడా ఓ లేఖను కేంద్రానికి రాసారు. ఇప్పటికే కేంద్రం ప్రతిపాదించిన సవరణలపై పలు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేసాయి. ఈ నేపధ్యం లో సీఎం కెసిఆర్.. కొత్త గా సవరించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని  తన లేఖ లో పేర్కొన్నారు. ఈ విద్యుతు బిల్లు సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కెసిఆర్ కేంద్రాన్ని కోరారు. 
            రాష్ట్ర అధికారాలను కాలదన్నేలా ఈ విద్యుత్ చట్టం ఉందని కెసిఆర్ విమర్శలు చేసారు. జాతీయ పున‌రుత్పాద‌క శ‌క్తి పాల‌సీలో మార్పులు చేసే ముందు రాష్ట్రాల‌ను సంప్ర‌దించాల్సిన అవసరం ఉందని.. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ప్ర‌త్యేక ప‌రిస్థితులు ఉంటాయని, వాటికి అనుగుణంగా మార్పులు చేసుకునే అవ‌కాశం రాష్ట్రాల‌కు కల్పించాలని కెసిఆర్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సవరించిన బిల్లు కారణం గా సబ్సిడీ పొందుతున్న రైతులు..గృహ వినియోగ‌దారుల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని కెసిఆర్ తన లేఖ లో పేర్కొన్నారు. ఈ బిల్లుపై మరోసారి ఆలోచించుకోవాలని ఆయన కోరారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox