Breaking News

తెలుగు రాష్ట్రాల సరిహద్దులో చెక్ పోస్టుల ఎత్తివేత.!

07 th Jun 2020, UTC
తెలుగు రాష్ట్రాల సరిహద్దులో చెక్ పోస్టుల ఎత్తివేత.!
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. లాక్ డౌన్ ఉన్న కూడా వ్యాధి వ్యాప్తి జరుగుతూనే ఉండడం, మరో వైపు ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడటం తో చేసేది లేక.. ప్రభుత్వం కూడా లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ.. ఆంక్షలను ఎత్తివేస్తోంది. మరో వైపు కేసుల సంఖ్యా గణనీయం గా పెరుగుతూనే ఉంది. ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 2లక్షల 46వేల 622కు చేరుకుంది.కాగా కరోనా మరణాల సంఖ్య భారత్ లో 6946కు పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో కేసుల తీవ్రత భారీగా పెరుగుతోంది.
            ఇదిలా ఉంటె... లాక్ డౌన్ ఆంక్షల సడలింపులు నేపధ్యం లో రెండు తెలుగు రాష్ట్రాలమధ్య సరిహద్దులను సోమవారం నుంచి ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాల మధ్య రాకపోకలను కేంద్రం అనుమతించడంతో పోలీసులు ఈచర్యలు తీసుకున్నారు. లాక్ డౌన్ సడలింపులతో రాకపోకలు భారీగా పెరిగాయి మూడు నెలల తరువాత తెరచుకోనుండడంతో తెలుగు రాష్ట్రాల వాహనదారులు ఊపిరి పీల్చుకోనున్నారు. మరో వైపు.. ఇతర రాష్ట్రాలనుంచి తెలంగాణకు వచ్చే వారి సంఖ్యా కూడా పెరిగింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox