Breaking News

దిగొచ్చిన కేంద్రం.. తెలంగాణకు నిధుల విడుదల..!

31 st Oct 2020, UTC

హైదరాబాద్ :భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్ నగరం బాగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని, భాగ్యనగరాన్ని ఆదుకోవడానికి కేంద్రం ముందుకొచ్చింది. పునరావాస కార్యక్రమాలకు సాయం అందించడానికి తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) కి  కేంద్ర ప్రభుత్వం 224.50 కోట్ల రూపాయలను మంజూరు చేయడానికి సంకల్పించింది. నిబంధనల ప్రకారం ఈ నిధులు ఫిబ్రవరి-మార్చి 2021లో విడుదల చేయవచ్చు.

కానీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ జి. కిషన్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం భాగ్యనగరంలో ఉన్న పరిస్థితులు ఆదుకోవాల్సిన అవసరం గురించి కిషన్ రెడ్డి అధికారులతో చర్చలు జరిపారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం కూడా హైదరాబాద్‌ను సందర్శించి వరద పరిస్థితిని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరిన తరువాత సహాయ నిధులు రాష్ట్రానికి అందుతాయి. 

విపత్తు కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే సాయం అందిస్తున్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పాడైన రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ కోసం కూడా కిషన్ రెడ్డి చొరవ తీసుకుని తెలంగాణకు 202 కోట్ల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసేలా చూశారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox