Breaking News

మహబూబ్‌‎నగర్‌ జిల్లాలో నవ వధువు ఆత్మహత్య

14 th May 2022, UTC

Mahbubnagar: వైజాగ్‌ మధురవాడ నవవధువు సృజన ఘటన మరువకముందే మరో విషాద ఘటన మహబూబ్‌‎నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపంతో ఓ నవ వధువు వివాహం జరిగిన కాసేపటికే ఆత్మహత్య చేసుకుంది. 

జిల్లా కేంద్రంలోని పాతతోట ప్రాంతానికి చెందిన  లక్ష్మికి అనంతపూర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్‌తో గురువారం వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా ఎంతో హుషారుగా కనిపించిన నవవధువు లక్ష్మి చనిపోవడం ఒక్కసారిగా పెళ్లింట విషాదాన్ని నింపింది. వివాహమైన కాసేపటికే నవ వధువు, బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ఆమె ఎంతకీ బాత్‌ రూమ్‌ నుంచి బయటకు రాకపోవడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఆమె స్పృహలేకుండా కిందపడిపోయి కనిపించింది. 

వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించగా, లక్ష్మి అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, లక్ష్మి ఆత్మహత్యపై వివరాలు తెలియాల్సి ఉంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox