Breaking News

బీజేపీని బాయికాడ బొందపెట్టండి... మంత్రి హరీష్ రావు

29 th Oct 2020, UTC

తెలంగాణ: బాయి కాడ మీటర్ల పేరుతో కేంద్రం బిల్లు తెచ్చిందని.. బోర్ల వద్ద మీటర్లు వద్దనే రైతులు.. బీజేపీని 300 ఫీట్ల లోతులో పాతి పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌ జిల్లా చేగుంటలో రోడ్‌షో, రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో కాలిపోయే మోటార్లు, పైసలు ఉంటేనే ట్రాన్స్‌ఫార్మర్లు వచ్చేవని, బీజేపీ ప్రభుత్వం ఏకంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించేందుకు చట్టం తీసుకొచ్చిందన్నారు.

ఏప్రిల్‌ 27న కేంద్ర ప్రభుత్వం ఉచిత కరెంటు, సబ్సిడీ కరెంటు ఇవ్వొద్దని, వ్యవసాయ మీటర్లు పెడితే రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్రం మే 17న లేఖ రాసిందన్నారు. అయినప్పటికీ.. రైతులకు ఉచిత కరెంటు అందిస్తామని కేంద్రానికి సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారన్నారు. కాళేశ్వరం నీళ్లు దుబ్బాక వరకు వచ్చాయని.. త్వరలోనే చేగుంట, శంకరంపేట మీదుగా మెదక్‌ వరకు అందిస్తామన్నారు. మార్కెట్‌ కమిటీలను ప్రైవేట్‌ పరం చేస్తే రైతులు ఆగమవుతారని మంత్రి తెలిపారు. వ్యవసాయాన్ని ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేయమంటే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. 

టీఆర్‌ఎస్‌ మాత్రం బీడీ కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు రూ.2 వేల పింఛన్‌ అందిస్తోందన్నారు. కేంద్రం దేనికోసం నిధులు ఇచ్చిందో నిరూపించమంటే బీజేపీ నేతలు తోకముడిచారని హరీష్ ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ ప్రచారంలో పరాయి నాయకులు, కిరాయి జనాలే కనిపిస్తున్నారని విమర్శించారు. దుబ్బాకలో సుజాతక్కను గెలిపిస్తే మనకు సీఎం నిధులు ఇస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox