Breaking News

సాగర్ ఎన్నిక ముందు బీజేపీకి షాక్..

30 th Mar 2021, UTC
సాగర్ ఎన్నిక ముందు బీజేపీకి షాక్..

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ టిక్కెట్ ఆశించిన అంజయ్య యాదవ్ తనకు టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి లోనయి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. సీఎం కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌లో కలిసి టీఆర్ఎస్‌లో చేరారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించి అంజయ్య యాదవ్ నిరాశకు గురయ్యారు. రవి నాయక్‌కు బీజేపీ టికెట్ ఇవ్వడంతో అంజయ్య యాదవ్ తీవ్ర అసంతృప్తి చెందారు.

టీఆర్ఎస్‌లో చేరికపై అంజయ్యతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో అంజయ్య టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అంజయ్య యాదవ్‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, సైదిరెడ్డి తమ పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. అంజయ్యకు సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox