Breaking News

భూమా అఖిల ప్రియ పోలీస్ కస్టడీ పూర్తి..!

13 th Jan 2021, UTC
భూమా అఖిల ప్రియ పోలీస్ కస్టడీ పూర్తి..!

బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారంలో ఏ1  నిందితురాలుగా ఉన్న టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి  భూమా అఖిల  ప్రియను పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సంగతి విదితమే. తాజాగా, పోలీస్ కస్టడీ పూర్తి అయ్యింది. ఈ మూడు రోజులు ఆమెను విచారించిన పోలీసులు ఆమె నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారని తెలుస్తోంది. 

ఈ మూడు రోజుల్లోనే, పోలీసులు దాదాపు 300 ప్రశ్నలు అడిగి ఉంటారని సమాచారం. అయితే, భూమా అఖిల ప్రియ మాత్రం తొలుత దాటివేత ధోరణి ని అవలంబించారు.కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానాలు  ఇచ్చారు. అయితే, సాంకేతిక ఆధారాలను రుజువు చూపించడం తో వాటిని భూమా అఖిల ప్రియ ఒప్పుకున్నారని తెలుస్తోంది. రేపు మధ్యాహ్న సమయం లో ఆమె ను కోర్ట్ లో ప్రవేశ పెట్టె అవకాశం ఉంది. 

నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్ తో పాటు మరో ఇద్దరు ఎసిపిల బృందం అఖిల ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొత్తం 19 మందిని పోలీసులు ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యం గా విచారిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. వీటిల్లో వాస్తవం ఎంతో  తేలాల్సి ఉంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox