Breaking News

పక్క రాష్ట్రములో ఏమి చేయలేనోడు ఇక్కడేంచేస్తాడు?

21 st Nov 2020, UTC

హైదరాబాద్ :గ్రేటర్ ఎన్నికలలో బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పిన జనసేన చివరకు గడువు ముగిసిపోవడంతో ఎన్నికల నుంచి తప్పుకుంది. అయితే, బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ విషయం రాజకీయాల్లో హాస్యాస్పదం అవుతోంది. తాజాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

పక్క రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి  జీహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీకి దిగుతానని చెప్పడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. అక్కడ ఆ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన వెంట నడవలేదని బాల్క సుమన్ ఎద్దేవా చేసారు. అలాంటి వ్యక్తిని బీజేపీ కలుపుకోవడం మరీ విడ్డురమన్నారు. విస్తృత ప్రయోజనాల కోసం ఇక్కడ పోటీ చేయడం లేదని ఆ పార్టీ ప్రకటన ఎవరికీ అర్ధం కాకుండా ఉందని సుమన్ సెటైర్లు వేశారు. ఆ పార్టీ ప్రకటనలు చూసి జనాలు నవ్వుతున్నారని ఎద్దేవా చేసారు.

నేటి నుంచి తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఇంకా సీట్ల పంపకం విషయంలోనే బిజీగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం భాగ్య నగరం ప్రశాంతంగా ఉందన్నారు. భవిష్యత్ లో కూడా హైదరాబాద్ ప్రశాంతంగా ఉండేలా తాము చర్యలు తీసుకుంటామని అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox