Breaking News

మొత్తానికి వరవరరావుకు బెయిల్ వచ్చేసింది..!

22 nd Feb 2021, UTC

విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. విప్లవ నేత వరవరరావు గోరేగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది కాలం పాటు ఆయన జైలు జీవితం అనుభవించారు. తాజాగా, కొద్దీ సేపటి క్రితం ఆయనకు బెయిల్ లభించింది. ముంబై హై కోర్ట్ వరవరరావు కు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

ఈ సందర్భంగా ముంబై హై కోర్ట్ న్యాయమూర్తి ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కేసుకు సంబంధించిన విచారణ విషయంలో పోలీసులకు సహకరించాలని ఆదేశించారు. ఒకవేళ సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తే బెయిల్ ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు సాయంత్రంలోపు బెయిల్ పేపర్లను జైలు అధికారులకు అందించి ఆయనను విడుదల చేసే ఏర్పాట్లు చేస్తామని వరవరరావు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox