Breaking News

జైలు నుంచి అఖిలప్రియ విడుదల

23 rd Jan 2021, UTC
జైలు నుంచి అఖిలప్రియ విడుదల

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలైన భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆమె 18 రోజులుగా జైలులోనే ఉన్నారు. అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు కావడంతో బెయిల్ ఆర్డర్ కాపీలను ఆమె తరుఫు న్యాయవాదులు జైలుకు తీసుకువచ్చారు. అఖిలప్రియకు శుక్రవారం సెసెషన్స్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అఖిల ప్రియ విడుదల కానుండటంతో ఆళ్లగడ్డకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు.

అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్‌ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్‌ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్‌ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox