Breaking News

మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు..

23 rd Sep 2020, UTC

హైద‌రాబాద్ :మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ర్ట అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఏపీ, తెలంగాణలోని ఆయ‌న బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు జరగనున్నట్లు తెలిసింది. గ‌తంలో ఉప్ప‌ల్ సీఐగా, చిక్కడపల్లి, మల్కాజిగిరి ఏసీపీగా నరసింహారెడ్డి ప‌ని చేశారు. ఆ సమయంలో ఆయన అనేక భూత‌గాదాల్లో త‌ల‌దూర్చినట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

హైద‌రాబాద్‌లోని సికింద్రాబాద్, మ‌హేంద్ర‌హిల్స్, డీడీ కాల‌నీ, అంబ‌ర్‌పేట‌, ఉప్ప‌ల్, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, అనంత‌పూర్‌లో సోదాలు కొన‌సాగుతున్నాయి. సికింద్రాబాద్ నివాసంలో భారీగా బంగారు, వెండి ఆభ‌ర‌ణాల‌ను అధికారులు గుర్తించారు. వాటితో పాటు భారీగా ఆస్తులు, ప్లాట్స్, వ్యవసాయ భూములు గుర్తించారు. ఈ ఆరోపణలు నిజమైతే అరెస్ట్ చేసి అవకాశం ఉందంటున్నారు అధికారులు. అంతేకాక నరసింహారెడ్డి నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, భూ వివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ ఐజీ చంద్రశేఖ‌ర్‌రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ న‌రసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించిన‌ట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు

హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రజా ప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబందాలు కూడా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. కొండాపూర్ లోని సర్వే నెంబర్ 64లో అసైన్డ్ భూమిని ఏసీపీ నరసింహ రెడ్డి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఏసీబీ సోదాల్లో అధికారులు అసైన్డ్ భూమిని కొనుగొలు చేసిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.మధుకర్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు ఏసీబీ విచారణలో ఏసీపీ నరసింహ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లా గంగాధరలోని మధుకర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో వారిని చూసి మధుకర్ పరారయ్యాడు. ఘట్‌కేసర్ సమీపంలోని యమాన్ పేట్‌లో 30 ఎకరాల వివాదాస్పద భూమిని కూడా కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నిజాం కాలం నాటి భూమిని రాజకీయ నాయకులతో కలిసి కొనుగోలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని గంగాధర ఎంపీపీ శ్రీరాం మధుకర్ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox