Breaking News

ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌లు కలసి పనిచేయబోతున్నాయి..!

28 th Sep 2020, UTC

హైదరాబాద్ :దుబ్బాక, గ్రేటర్ లలో ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలసి పనిచేయబోతున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ ఆరోపణలు గుప్పించారు. తెరాస నేతకు ఓట్లు వెయ్యాలని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే గ్రేటర్ ఎన్నికలలో మాత్రం బీజేపీ సత్తా చాటుతోందని బీజేపీలో గ్రూపులు వర్గాలు లేవన్నారు.

పాలమూరు, రంగారెడ్డి ప్రాజక్టును కట్టలేని ముఖ్యమంత్రి కేసిఆర్ కి కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకించే హక్కు లేదని డీకే అరుణ అన్నారు. బీజేపీ పార్టీ పై ఉన్న భయంతోనే  కేసిఆర్ వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నదని అరుణ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు కేసిఆర్ మీద ఉన్న భ్రమలు తొలగిపోయాయన్నారు. తెలంగాణ రాష్ట్రములో భవిష్యత్ బీజేపీ కె ఉందన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి రాలేదని తనకేమి నిరాశ లేదన్నారు జాతీయ నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని డీకే అరుణ ఈ సందర్భంగా స్పష్టం చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox