Breaking News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..!

02 nd Jun 2020, UTC
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..!

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఎంతో మంది ప్రజల కల నెరవేరిన రోజు ఇది. ఎందరో ప్రాణ త్యాగాలతో జూన్ 2న సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆరు వసంతాలు పూర్తి చేసుకుని నేటితో 7వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.1969 లో మొదలైన తెలంగాణ 2014 వరకు సాగింది.. ఈ ఉద్యమం లో వివిధ దశల్లో వందలాది మంది తమ ప్రాణాలను త్యజించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక సంఘాలన్నీ ఒక్కటై పోరాడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. వీరందరి పోరాటం ఫలితం గా ఫలితంగా 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది. దీనికి 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు బీజేపీ మద్దతుతో లోకసభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించగా, 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.లక్షలాది ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox