టెన్త్ విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లలో ఉంటున్న ఇతర ప్రాంత విద్యార్థులకు వారి సొంత ప్రాంతాల్లోనే పరీక్ష రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. విద్యార్థుల వివరాలను డీఈవోలకు పంపించాలని విద్యాశాఖ ఆదేశించింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 8 నుంచి జులై 5 వరకూ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్ 8న ఇంగ్లీష్ పేపర్-1, జూన్ 11న ఇంగ్లీష్ పేపర్-2, 14న మ్యాథ్స్ పేపర్-1, 17న మ్యాథ్స్ పేపర్-2, 20న సైన్స్ పేపర్-1, 23న సైన్స్ పేపర్-2, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 29న సోషల్ స్టడీస్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
మార్చి 19న తెలంగాణలో టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. 3 పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టెన్త్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే