Breaking News

నాకు కరోనా వస్తే గాంధీ కే వెళ్తా : తలసాని

01 st Aug 2020, UTC

హైదరాబాద్ :తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో గాంధీ ఆసుపత్రి పై ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. సరైన సదుపాయాలు లేవని ఎక్విప్మెంట్ కొరత ఉందని బెడ్స్ సరిపోవడంలేదని ఇలా పలు రకాలుగా ఆరోపణలు విమర్శలు తలెత్తుతుండడంతో ప్రజలు గాంధీ ఆసుపత్రి కి వెళ్ళడానికే భయపడుతున్నారు.
        అయితే ఈ నేపధ్యంలో తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు కరోనా వస్తే, గాంధీ ఆసుపత్రికే వెళ్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోందని ఆయన చెప్పుకొచ్చారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గంలో రూ. 700 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఈ సందర్భం గా తలసాని చెప్పుకొచ్చారు.
          గతంలో ఈ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రాతినిథ్యం వహించారని, అప్పట్లో కూడా ఈ స్థాయిలో అభివృద్ధి జరగలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రూ. 68 కోట్లతో చేపట్టిన 4 లేన్ల రైల్వే అండర్ బ్రిడ్జి, రూ. 45 కోట్లతో నిర్మిస్తున్న ఫతేనగర్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టామని, ఇవి పూర్తైతే ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోనున్నాయని తలసాని చెప్పుకొచ్చారు. కమ్యూనిటీ హాల్స్, బస్తీ దవాఖానాలు, మోడల్ మార్కెట్లు, వైట్ ట్యాపింగ్ రోడ్లు, డ్రైనేజీలు, వంటి ఇతర అంశాలపై కూడా దృష్టిసారించామని ఆయన చెప్పుకొచ్చారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox