Breaking News

"కేటీఆర్ ను సీఎం చేయాలి..".. టీఆరెస్ నేతల డిమాండ్..!

15 th Aug 2020, UTC

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసిఆర్ తనయుడు కేటీఆర్ పార్టీ విషయాల్లో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. మరో వైపు, పార్టీ పరిస్థితులపై కూడా కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నారు. కెసిఆర్ కేవలం పాలనా వ్యవహారాలకు పరిమితం అయిపోయారు. ఈ నేపధ్యంలో ఎదో జరుగుతోందన్న అనుమానం అందరికి బలపడుతోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఇప్పటికే పార్టీ వర్గాలకు అర్ధం అయిపొయింది.

ఈ నేపధ్యంలో ఇటీవల రాష్ట్ర కాబినెట్ మీటింగ్ జరుగగా, అందుకు కూడా కేటీఆర్ అధ్యక్షత వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా, కేటీఆర్ ను సీఎం చేయాలనే డిమాండ్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ విషయమై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ డైనమిక్ లీడర్ అని, ఆయనకు సీఎం పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేసారు. ఓ ముఖ్యమంత్రికి కావాల్సిన అర్హతలన్నీ కేటీఆర్ కు ఉన్నాయని షకీల్ వ్యాఖ్యానించడం గమనార్హం. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox