Breaking News

అంతా బాగుంటే అసెంబ్లీ ఎందుకు..? : సీతక్క

14 th Sep 2020, UTC

హైదరాబాద్ :ఇటీవల, కొన్ని రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎదుట బైకెలి నాగులు (55) అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న సంగతి విదితమే. కాగా, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. కాగా ఈ విషయాన్నీ ములుగు కాంగ్రెస్ శాసనసభ్యురాలు సీతక్క అసెంబ్లీ లో ప్రస్తావించారు. ఓ ఉద్యమ కారుడు మరణిస్తే, కనీసం స్థానిక నేతలు నివాళులు అర్పించకపోవడం బాధాకరమన్నారు.

ఈ దుర్ఘటన కళ్ళముందు జరుగుతున్నా మంత్రులు, ఇతర టీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. నాగులు మృతదేహం పై టిఆర్ఎస్ కండువా కప్పారని, ఒక్కరు కూడా అతని కుటుంబాన్ని పరామర్శించడానికి రాలేదని ఆవేదన చెందారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గౌరవించాలని, నాగులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీతక్క డిమాండ్ చేసారు. హోమ్ మంత్రి నాగులు విషయంలో ఓ ప్రకటన చేయాలనీ కోరారు.

సీతక్క మాట్లాడుతుండగా, అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. సీతక్క అసంతృప్తికి గురయ్యారు. తమకు జీరో అవర్ లో కూడా మాట్లాడేందుకు సమయం ఇవ్వడంలేదని అన్నారు. తమ గొంతు నొక్కితే ఏమొస్తుందని ప్రశ్నించారు.అంతా బాగుంటే అసెంబ్లీ ఎందుకు? అని ప్రశ్నించారు. అంత బాగుంది అని సొంత డబ్బా కొట్టుకోవడానికే సమయం సరిపోతుందని, సమస్యల కోసం చర్చించుకోవడానికి అసెంబ్లీ ఉందని సీతక్క చెప్పుకొచ్చారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox