Breaking News

కేటీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి... బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

22 nd Sep 2020, UTC

హైదరాబాద్ :తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కరోనా వైరస్ నియంత్రణకు రూ.200 కోట్లు మాత్రమే ఇచ్చారని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారని, అది అబద్ధమని అన్నారు. కేటీఆర్‌కి నల్లికుట్ల రామారావు అని పేరు పెడితే బాగుండని అరవింద్‌ అన్నారు. తెలంగాణకు కేంద్రం రూ.7 వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. అబద్ధాలు చెప్పడంలో మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌ని మించిపోయారన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఎంపీ అరవింద్‌ అన్నారు.

మరోవైపు మంగళవారం నాడు పార్లమెంట్ సమావేశాల అనంతరం ఢిల్లీలో ఎంపీలు మీడియా మీట్ నిర్వహించారు. తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇస్తేనే కేంద్రం దగ్గర డబ్బులుంటున్నాయని.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన చాలా ఆదాయాల్లో కోత విధించారని ఎంపీ రంజిత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా నియంత్రణకు రాష్ట్రానికి రూ.290 కోట్లే ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు.బీజేపీ ఎంపీలు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు అని మరో ఎంపీ వెంకటేష్ అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగానే రెవెన్యూ బిల్లు ఆమోదించామని, బీజేపీ తెచ్చిన బిల్లుపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారని వెంకటేష్ తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox