హైదరాబాద్ :సీఎం
కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. రజాకార్ల కాలంలో హిందూ పండుగలు జరుపుకోవడానికి ఆంక్షలు విధించేవాళ్లని ఇప్పుడు కేసీఆర్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. గణేష్ మండపాల వద్ద పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పూజల కోసం వెళ్లే అర్చకులను సైతం వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. నియంత నిజాం గురించి మనం చెప్పుకుంటున్నట్లే భవిష్యత్ తరాలు కేసీఆర్ నియంతృత్వ ధోరణి గురించి చెప్పుకుంటారని వ్యాఖ్యానించారు. ఒవైసీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ అని దుయ్యబట్టారు. హిందూ పండుగల పట్ల కేసీఆర్ ప్రదర్శిస్తున్న వివక్షను చరిత్ర క్షమించదని అన్నారు. ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్బంధ వైఖరిని ప్రజలు తిప్పికొట్టాలని సంజయ్ పిలుపునిచ్చారు.