Breaking News

గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులపై ఊడి పడ్డ ఫ్యాన్..!

03 rd Jun 2020, UTC
గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులపై ఊడి పడ్డ ఫ్యాన్..!
హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగాలకు చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. వీరికి చికిత్స అందిస్తున్నవార్డులో ఫ్యాన్ ఊడి పడింది. ఈ ప్రమాదం వల్ల ఇద్దరికీ గాయాలయ్యాయి.  ఆసుపత్రిలోని ఏడవ అంతస్తులో పలువురు పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఏడవ అంతస్తు లో కరోనా వార్డు లో ఓ ఫ్యాన్ అకస్మాత్తుగా హుక్ నుంచి వేరుపడి కిందనే ఉన్న రోగులపై పడింది. ఆ సమయంలో బెడ్ పై ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన తో అక్కడి రోగులు మరింత భయాందోళనకు గురి అయ్యారు.
       ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ప్రశ్నించగా.. ఈ విషయం ఆయన దృష్టికి రాలేదని తెలిపారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని  ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఇటువంటి ఘటనలు మరోసారి జరుగకుండా చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox