Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీ లో కరోనా కలకలం...!

02 nd Jun 2020, UTC
ఉస్మానియా మెడికల్ కాలేజీ లో కరోనా కలకలం...!

హైదరాబాదు లో కరోనా కల్లోలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.రోజు రోజు కు హెచ్చు సంఖ్యా లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యం లో ఉస్మానియా కళాశాల లో పన్నెండు కేసులు నమోదు కావడం స్థానికుల్లో కలకలం సృష్టించింది. ఒకేచోట ఇన్ని కేసులు నమోదవడం తో అధికారులు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ కొనసాగుతుండడంతో చాలామంది విద్యార్థులు హాస్టల్ లోనే ఉంటున్నారు. ఉస్మానియా వైద్య కళాశాల హాస్టల్ లో 296 మంది విద్యార్థులు ఉండగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో, 12 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ఇంకా మరికొందరి ఫలితాలు రావాల్సి ఉందని మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ వెల్లడించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox