Breaking News

తెలంగాణ లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజులోనే 94 ..!

02 nd Jun 2020, UTC
తెలంగాణ లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజులోనే 94 ..!
కరోనా మహామారి తెలంగాణ లో తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కాగా... నేడు రికార్డు స్థాయి లో కేసులు నమోదు అయ్యాయి. నిన్నమొన్నటి దాకా పాజిటివ్‌ కేసులు లేని జిల్లాల్లో కూడా ప్రస్తుతం నమోదవుతున్నాయి. యాదాద్రి భువనగిరి, వనపర్తి వంటి జిల్లాల్లోనూ తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. అంతేకాదు.. ఇప్పటివరకు సాధారణ ప్రజలే ఈ మహమ్మారి బారిన పడగా.. తాజాగా రాజకీయ నాయకులు, ప్రముఖులను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. 
          సోమవారం బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక రాష్ట్ర పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయమైన డీజీపీ ఆఫీస్ లోనూ ఒకరికి వైరస్‌ సోకింది. కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడం తో అధికారుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. నేడు ఒక్కరోజే 94 కేసులు నమోదయ్యాయి... మొత్తం ఆరుగురు మృత్యువాత పడ్డారు. పాజిటివ్‌ అని తేలిన వారిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివారే 79 మంది ఉన్నారు. మిగిలిన కేసుల్లో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మూడు చొప్పున, మెదక్‌, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున, జనగాం, పెద్దపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా 2,792కు చేరింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox