Breaking News

బైరాన్ పల్లిని చారిత్రక ప్రదేశంగా గుర్తించాలి... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

15 th Sep 2020, UTC

హైదరాబాద్ :తెలంగాణ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని బైరాన్‌పల్లి, కూటిగల్లు, హుస్నాబాద్‌ ప్రాంతాల్లోని బురుజులు, స్తూపాల వద్ద  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా చాడ మాట్లాడుతూ నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల త్యాగాలు చిరస్మరణీయం అన్నారు. ఈ ప్రాంతానికి నిజమైన స్వాతంత్య్రం నిజాం పాలన అంతమైన తర్వాతే వచ్చిందన్నారు. 86 మంది అమరులను ఒకే చితిపై పెట్టి నిప్పుపెట్టిన చరిత్ర ఇక్కడి నేలదన్నారు. ఎన్నికల సందర్భంలో వచ్చిన నాయకులు ౖబైరాన్‌పల్లిని చారిత్రక ప్రదేశంగా గుర్తిస్తామని, అభివృద్ధి చేసి స్మారక చిహ్నం, మ్యూజియం నిర్మిస్తామని చెప్పారే తప్పా, ఏ ఒక్కరూ కూడా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బైరాన్‌పల్లి్ని చారిత్రక భూమిగా గుర్తించి అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox