Breaking News

50 వేల టెస్ట్ లు..: కెసిఆర్

15 th Jun 2020, UTC
50 వేల టెస్ట్ లు..: కెసిఆర్
తెలంగాణ లో కరోనా పంజా విసురుతోంది. టెస్టులు చేయడం లేదని గతం లో హై కోర్ట్ ఆగ్రహించిన సంగతి తెలిసిందే. అయితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఐసీఎమ్ ఆర్ నిబంధనల మేరకే నడుచుకుంటున్నామని చెప్పుకుంటూ వచ్చింది. ప్రస్తుతం యాభై వేల టెస్ట్ లు చేయాలనీ కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కఠినంగా అమల్లో ఉన్న ఏప్రిల్‌లో రాష్ట్రంలో 941 కేసులు నమోదు కాగా.. జూన్ నెలలో రెండు వారాల్లోనే 2276 కేసులు నమోదయ్యాయి. 
                 గత నెలంతా...రాష్ట్రము లో కేసులు లేవు.. ఉన్నవి కూడా ఓ వారం లో క్లియర్ అవుతాయి అనే పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నం గా ఉంది. ఎవరికీ కరోనా ఉందొ..ఎవరికీ లేదో తెలియదు.. ఎవరి నుంచి ఎవరికీ కరోనా సోకుతోందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్పటికిప్పుడు 50 వేల టెస్టులు చేసినా.. మరింత మందికి కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరమైతే ఉంది. ఐసీఎంఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ... కొంతమందికి కరోనా సోకినా నేపధ్యం లో వారికి ఎవరి నుంచి కరోనా సోకిందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి కేసులు మరిన్ని పెరగకుండా ఉండాలంటే.. కేసుల సంఖ్యా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
                మరో వైపు.. ఆంధ్ర ప్రదేశ్ లో 5 లక్షలకు పైగా కరోనా కేసులు చేయడం.. నాణ్యమైన చికిత్సను అందించడం తో తెలంగాణ లో టెస్టులు పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇది ఇలా ఉంటె.. తెలంగాణ లో సామాన్య ప్రజలకు ఒకలాగా...విఐపిలకు ఒకలాగా చికిత్స అందిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు ప్రయివేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతుంటే.. సామాన్య ప్రజలను మాత్రం గాంధీ హాస్పిటల్‌కే పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 
 
              ఇటీవల..జనగామ ఎమ్మెల్యే కు కరోనా సోకింది. అయితే.. ఆయన భార్య తో పాటు గన్ మెన్, చివరికి వంట మనిషి కి కూడా కరోనా సోకింది. కానీ వీరెవరిలోను లక్షణాలు కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు రెండుసార్లు కరోనా టెస్టు చేయగా నెగటివ్ అని వచ్చింది. ఒకవేళ ప్రభుత్వం..  ఐసీఎంఆర్ మార్గదర్శకాల పాటిస్తుంటే..వీరందరికి లక్షణాలు లేకుండా పరీక్షలు ఎందుకు చేసారని విమర్శలొస్తున్నాయి. సామాన్యులను ఒకలా.. విఐపిలను ఒకలా చూస్తున్నారనే విమర్శలు ప్రజలనుంచి వెల్లువెత్తుతున్నాయి. 
 
             శనివారం 750 మందికి కరోనా టెస్టులు చేయగా.. 237 మందికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. ఒకవేళ టెస్ట్ ల సంఖ్యా మరింత పెంచితే..  ఏ నిష్పత్తి లో కేసుల సంఖ్యా పెరిగినా.... లక్షణాలు కనపడకుండా కరోనా వైరస్ సోకిన వారి నుంచి ఇతరులను కాపాడవచ్చు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox