Breaking News

ఒకే రోజు 23 మంది జర్నలిస్టులకు కరోనా..!

15 th Jun 2020, UTC
ఒకే రోజు 23 మంది జర్నలిస్టులకు కరోనా..!
కరోనా మహమ్మారి రాష్ట్రము లో భీబత్సం సృష్టిస్తోంది. తెలంగాణ లో కరోనా పరీక్షలు పెంచిన నేపధ్యం లో కేసుల సంఖ్యా కూడా పెరుగుతోంది. మరోవైపు.. ఫ్రంట్ ఉంది పోరాడే వైద్యులు..పోలీసులు..మీడియా సిబ్బంది ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. గత పది రోజులుగా తెలంగాణ జర్నలిస్టుల్లో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. ఆదివారం ఒక్క రోజే 23 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ తేలింది.
 
                       శనివారం రోజున జర్నలిస్టులకు... వారి కుటుంబ సభ్యులు అందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే.. నిన్న వాటి ఫలితాలు వెలువడ్డాయి. ఒక్కరోజే 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.  నమోదయిన ఈ కొత్త కేసులతో రాష్ట్రంలో కరోనా బారినపడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు 70కు చేరింది. మూడు రోజుల క్రితం జర్నలిస్టులకు కరోనా టెస్ట్ లు నిర్వహించడం తో..ఓ ఇరవై మందికి కరోనా పాజిటివ్ తేలిందని అధికారులు వెల్లడించారు. 
 
                      బయట జరిగే విషయాలని ప్రతి క్షణం సమాచారాన్ని ప్రజలకు అందించే జర్నలిస్ట్ లు కరోనా పోరాటం లో ఈ మహమ్మారి కి బలి అవుతున్నారు. అలాంటి జర్నలిస్టులకు వైద్యం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ఓ ప్రత్యేకమైన వార్డును ఏర్పాటుచేసింది. ఇకనుంచి జర్నలిస్ట్ లకు ఆ ప్రత్యేక వార్డు లోనే చికిత్సలు అందించనున్నట్లు గాంధీ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఇటీవల..మనోజ్ అనే జర్నలిస్ట్ కరోనా సోకి మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఈ వార్డు కు అతని పేరుతోనే నామకరణం చేసారు. వైద్యులు, పోలీసులతో పాటు వార్తా సేకరణలో భాగంగా జర్నలిస్టులు కంటైన్మెంట్‌ జోన్లలో పర్యటించి, కరోనా వైరస్‌ వ్యాప్తి, వైద్య సేవలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న విషయం తెలిసిందే.
 
                  ఇక ఇప్పటికే రాష్ట్రంలో 16 మంది మీడియా మిత్రులకి కరోనా వైరస్‌ సోకగా, వారిలో ఓ యువజర్నలిస్టు సకాలంలో వైద్యసేవలు అందక మృతి చెందాడు. దీనితో.. జర్నలిస్టుల వద్ద నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై.. వైద్యులు, పోలీసులతో సమానంగా జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. కరోనా సోకినా వారికి ప్రత్యేకం గా చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox