Breaking News

ప్రైవసీ పాలసీ పై వెనక్కి తగ్గిన వాట్సాప్

09 th Jul 2021, UTC

గోప్యతా విధానం (ప్రైవసీ పాలసీ)ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్. ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం తెలిపింది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్, రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో దీనిని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, ఈ పాలసీని అంగీకరించే నిర్ణయాన్ని వినియోగదారులకే వదిలేస్తున్నామని, వారిపై ఒత్తిడి చేయబోమని పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తెలియజేశారు.

ప్రభుత్వం ఈ ప్రైవసీ పాలసీని నిలిపివేయాలని చెప్పింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు వచ్చేవరకు మేం దీన్ని అమలు చేయమని చెప్పాం. తాత్కాలికంగా నిలిపివేస్తూ స్వచ్ఛందంగా అంగీకరించాం. ఒకవేళ బిల్లు దీన్ని అనుమతిస్తే, అందుకు తగినట్టు వ్యవహరిస్తాం. రాబోయే వారాల్లో వాట్సాప్ ఎలా పనిచేస్తుందో దాని కార్యాచరణను మేం పరిమితం చేయబోం’ అని న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు వెల్లడించారు. అలాగే వాట్సాప్ పాలసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కేంద్రం భావిస్తోందని వివరించారు.

వాట్సాప్ తన ప్రైవసీ పాలసీని ఈ ఏడాది జనవరిలో అప్‌డేట్ చేసింది. యూజర్లు జరిపే సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన సమాచారాన్ని తన మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్‌తో పంచుకునేందుకు ఈ కొత్త విధానం అనుమతి ఇస్తుంది. ఈ విధానాన్ని అంగీకరించని యూజర్లకు సేవలను పరిమితం చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో వాట్సాప్ యూజర్లు తమ వ్యక్తిగత గోప్యత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 

విమర్శలు రావడంతో కాస్త వెనక్కు తగ్గిన వాట్సాప్ తన నిర్ణయం మారబోదని మళ్ళీ ఫిబ్రవరిలో ప్రకటించింది. ఈ ఆలోచనలను మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరినప్పటికీ వాట్సాప్‌ ఈ ప్రకటన చేసింది. సేకరించే ‘సున్నితమైన వ్యక్తిగత’ సమాచారం గురించి, ఆ సమాచారాన్ని ఎవరితో పంచుకుంటారనే విషయం గురించి ఈ కొత్త విధానం వివరించలేదని ప్రభుత్వం పేర్కొంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox