Breaking News

దిగొచ్చిన వాట్సాప్.. ప్రైవసీ నిబంధనల్లో మార్పు..!

12 th Jan 2021, UTC

ప్రముఖ మెస్సేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ని ప్రవేశ పెట్టడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంతో వాట్సాప్ దిగొచ్చింది. ఈ విషయం పై వినియోగదారులకు స్పష్టత ఇచ్చింది. అన్ని ప్రైవేట్ మెసేజ్ లకు వందశాతం ప్రొటెక్షన్ ఉంటుందని, ఊహాగానాలను నమ్మవద్దని ట్విట్టర్ వేదికగా వినియోగదారులను కోరింది. 

ఈ పాలసీ నిబంధనల ప్రభావం కేవలం బిజినెస్ ఖాతాలపైనే ఉంటుందని పేర్కొంది. అయితే, స్నేహితులకు, సన్నిహితులకు పంపుకునే సమాచారం పూర్తిగా రహస్యంగానే ఉంటుందని పేర్కొంది. వాట్సాప్ ద్వారా పంపుకునే సమాచారం ఫేస్ బుక్ అప్లికేషన్ కు కూడా తెలియవని హామీ ఇచ్చింది. అలాగే, ఎవరి ప్రైవేట్ మెసేజ్లు, కాల్స్ తాము చూడబోమని వాట్సాప్ స్పష్టం చేసింది. కాల్ లాగ్స్ ను మాత్రం సేవ్ చేసి ఉంచుతామని తెలిపింది. కాంటాక్ట్ ల వివరాలు కూడా గోప్యంగానే ఉంటాయని హామీ ఇచ్చింది. 

ప్రస్తుతం ఫేస్ బుక్ వాట్సాప్ కు యాజమాన్యంగా ఉంది. అయినప్పటికీ వాట్సాప్ ఓ ప్రైవేట్ సంస్థలాగానే విధులు నిర్వర్తిస్తుందని పేర్కొంది. అవసరం అయితే, వినియోగదారులు తమ మెసేజ్ లను కొంత సమయం తరువాత డిలీట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని పేర్కొంది. అలాగే, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ డేటాను తిరిగి పొందే సౌకర్యాన్ని అందించబోతున్నట్లు వాట్సాప్ పేర్కొంది. మరిన్ని వార్తలు చదవండి 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox