Breaking News

ఏప్రిల్ లో 16 లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలు బ్యాన్

03 rd Jun 2022, UTC

New Delhi: టెక్స్ట్ పంపాలన్నా, ఇమేజ్ పంపాలన్నా, వీడియో పంపాలన్నా, ఏది ట్రాన్సఫర్ చేయాలన్నా, మొబైల్ యూజర్లు మెయిన్ గా వాడుతున్న యాప్ వాట్సప్. వాట్సాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ఫోన్‌ ఉండటం లేదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లోని మునిగి తేలుతుంటారు. అయితే ప్రతి నెల లక్షల కొద్ది అకౌంట్లను బ్యాన్‌ చేస్తోంది వాట్సాప్‌ సంస్థ. భారత్‌లో కొత్త ఐటీ రూల్స్ ప్రకారం 5 లక్షల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు కలిగిన డిజిటల్ కంపెనీలు ఈ వివరాలను ప్రతి నెలా ప్రచురించాల్సి ఉంటుంది.  మెటా మెసేజింగ్ ప్లాట్ ఫాం అయిన వాట్సప్ ఒక్క ఏప్రిల్ లోనే 16లక్షల 66వేల ఖాతాలు బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. 

వాట్సాప్‌ గ్రూపులలో అసభ్యరమైన పోస్టులు, ఫోటోలు, నిబంధనలు పాటించకపోవడం వల్ల సంస్థ ప్రతి నెల వాట్సాప్‌ అకౌంట్లను తొలగిస్తుంది. తాము ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ సేవల్లో ఇండస్ట్రీ లీడర్‌గా ఉన్నామని వాట్సాప్ ప్రతినిధి వెల్లడించారు. ఈ క్రమంలోనే వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, అనలిస్టులు, రీసెర్చర్లు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నిపుణులు, ఆన్‌లైన్ సేఫ్టి, టెక్నాలజీ డెవలప్‌మెంట్ నిపుణులతో కూడి బృందాలను నియమించామని తెలిపారు.

యూజర్లకు ఇబ్బందికరమైన కంటెంట్ ఏమైనా కనిపిస్తే, వారే స్వయంగా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించింది వాట్సాప్. తమకు ఫిర్యాదులు అందిన పలు వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేశామని వాట్సప్ సంస్థ వెల్లడించింది. ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ సేవల్లో తాము నంబర్ 1 గా ఉన్నామని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox